అబుదాబి విమానానికి బాంబు బెదిరింపు కేసు.. 22 ఏళ్ల వ్యక్తికి 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- June 06, 2025
యూఏఈ: అబుదాబి వెళ్తున్న విమానంలో బాంబు పెట్టినట్టు బెదిరింపులకు పాల్పడిన సింగపూర్‌లోని 22 ఏళ్ల వ్యక్తికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష, $50,000 (Dh183,500) వరకు జరిమానా విధించారు. ఆ యువకుడు ఫిబ్రవరి 14, 2025న సింగపూర్‌లో అబుదాబికి వెళ్లే విమానం ఎక్కిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో " విమానాన్ని పేల్చివేయబోతున్నాను " అని ఒక పోస్ట్ పెట్టాడు.
విమానాన్ని పేల్చివేస్తామనే బెదిరింపుతో కూడిన సోషల్ మీడియా పోస్ట్ గురించి తమకు సమాచారం అందిందని, పోస్ట్ చేసిన గంటలోనే ఆ వ్యక్తిని గుర్తించగలిగామని, ఆ వ్యక్తి అబుదాబికి వెళ్లే విమానంలో ఉన్నాడని నిర్ధారించామని సింగపూర్ పోలీస్ ఫోర్స్ తెలిపింది. "అప్పటికే రన్‌వేపై టేకాఫ్ అవ్వబోతున్న ఆ విమానాన్ని చాంగి విమానాశ్రయ టెర్మినల్ 2కి మళ్ళించారు. అక్కడ ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. విమానం ఎక్కిన తర్వాత అతను తన సోషల్ మీడియా ఖాతాలో 'నేను విమానాన్ని పేల్చివేస్తానని ఇక్కడ ఎవరికీ తెలియదు' అని పోస్ట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అతని వద్ద ఎటువంటి బెదిరింపు వస్తువులు గుర్తించలేదని సింగపూర్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!