'నేనోరకం' పాటను విడుదల చేసిన దేవిశ్రీ

- July 12, 2016 , by Maagulf
'నేనోరకం' పాటను విడుదల చేసిన దేవిశ్రీ

సాయిరామ్‌ శంకర్‌, రెష్మీమేనన్‌ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'నేనోరకం'. ఈ చిత్రంలోని 'చూడకుండా ఉండలేనే..' అనే పాట టీజర్‌ను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ మంగళవారం విడుదల చేశారు. ఈ విషయాన్ని దేవిశ్రీ సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ... చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. పాట టీజర్‌ను అందరూ చూడాలని కోరుతూ వీడియోను పోస్ట్‌ చేశారు. ఎస్‌. సుదర్శన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీకాంత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహిత్‌ నారాయణ్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com