టైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్: 12 స్వర్ణాలతో సత్తా చాటిన అథ్లెట్లు !
- June 08, 2025
తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్‌లో భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శనతో పతకాల వర్షం కురిపించారు. తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్ 2025 రెండవ రోజైన ఆదివారం భారత అథ్లెట్లు మరోసారి అద్భుతంగా రాణించారు. పలు విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెలుచుకుంటూ దేశానికి గౌరవం తీసుకొచ్చారు. భారత్ ఖాతాలో 6 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్య పతకం లు చేరాయి.
ఈ విజయాలతో, రెండు రోజుల టోర్నమెంట్లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 16కి చేరుకుంది. ఇందులో 12 గోల్డ్, 3 సిల్వర్ 1 బ్రాన్జ్ పతకాలు ఉన్నాయి.ఈ రెండు రోజుల పోటీలో పలు విభాగాలలో కొత్త రికార్డులు నమోదవడం గమనార్హం.
జావెలిన్‌లో అణ్ణు రాణి, రోహిత్ యాదవ్‌కు బంగారు పతకాలు
ద్విమాస ఒలింపియన్, ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అణ్ణు రాణి, మహిళల జావెలిన్ విభాగంలో 56.82 మీటర్ల రెండవ ప్రయత్నంతో స్వర్ణ గోల్డ్ మెడల్ పతకం గెలుచుకున్నారు. శ్రీలంకకు చెందిన హటరాబాగె లెకమాలాజే 56.62మీ తో రజతం, చైనీస్ తైపే అథ్లెట్ చు పిన్-హ్సున్ 53.03మీ తో కాంస్య పతకం గెలుచుకున్నారు.
మరోవైపు. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో రోహిత్ యాదవ్ భారత్‌కు తొలి (Gold Medal) పతకం అందించారు. తొలి త్రోలో 71.46మీ, తర్వాత 74.25మీ త్రో వేయగా, చివరి ప్రయత్నంలో 74.42మీ త్రో తో విజేతగా నిలిచారు. చైనీస్ తైపే అథ్లెట్ హువాంగ్ షీ-ఫెంగ్ 74.04మీ తో రజతం, టోక్యో ఒలింపియన్ చెంగ్ చావ్-సున్ 73.95మీ తో కాంస్యం సాధించారు.
విత్యా రామ్రాజ్కు 400మీ హర్డిల్స్‌లో గోల్డ్
మహిళల 400మీ హర్డిల్స్‌లో విత్యా రామ్రాజ్ తన సమర్థతతో 56.53 సెకన్ల టైమ్‌లో గోల్డ్ మెడల్ గెలిచారు. రెండవ స్థానంలో చైనీస్ తైపే అథ్లెట్ పే లిన్ లో (57.91), మూడవ స్థానంలో షిన్ రు జాంగ్ (58.94) నిలిచారు.
పురుషుల హర్డిల్స్‌లో యశస్కు రజతం
పురుషుల 400మీ హర్డిల్స్‌లో యశస్ పలాక్ష తన వ్యక్తిగత ఉత్తమ రికార్డ్ 49.22 సెకన్ల టైమ్ తో సిల్వర్ మెడల్ పతకం గెలుచుకున్నారు. చైనీస్ తైపే అథ్లెట్ చుంగ్ వే లిన్ 49.00 టైమ్ తో గోల్డ్ గెలిచాడు. జపాన్‌కు చెందిన యుసాకు కొడామా 49.41 టైమ్ తో కాంస్యం సాధించాడు.
మహిళల 800మీటర్లలో పూజా–ట్వింకిల్ చౌధరీ డబుల్ పతకాలు
పూజా మహిళల 800మీటర్ల ఫైనల్లో 2:02.79 సెకన్ల టైమ్ తో మీట్ రికార్డ్ నమోదు చేస్తూ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ట్వింకిల్ చౌధరి 2:06.96 తో సిల్వర్ మెడల్ సాధించింది. స్థానిక అథ్లెట్ జీ అన్చెన్ 2:10.91 టైమ్ తో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పూజా ఇంతకు ముందు 1500మీటర్లలో కూడా గోల్డ్ గెలిచింది.
కృష్ణన్ కుమార్‌కు 800మీటర్ల గోల్డ్ – చాంపియన్‌షిప్ రికార్డ్
పురుషుల 800మీటర్లలో కృష్ణన్ కుమార్ 1:48.46 సెకన్ల చాంపియన్‌షిప్ రికార్డ్‌తో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. ఫిలిప్పీన్స్‌కు చెందిన హుస్సేన్ లోరనా 1:48.67, ఆస్ట్రేలియాకు చెందిన హామిష్ డోనోహ్యూ 1:48.97 టైమ్ లతో వరుసగా రజతం, కాంస్యం గెలుచుకున్నారు.
లాంగ్ జంప్‌లో శైలి సింగ్, అన్సీ సోజన్‌కు పతకాలు
మహిళల లాంగ్ జంప్‌లో శైలి సింగ్ 6.41మీ తో సిల్వర్ మెడల్, అన్సీ సోజన్ (Ancy Sojan) 6.39మీ తో బ్రాన్జ్ మెడల్ పతకం గెలుచుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన డెల్టా అమీడ్జోవ్స్కీ తన చివరి ప్రయత్నంలో 6.49మీటర్ల జంప్‌తో గోల్డ్ గెలుచుకుంది.
4×400 మీటర్ల రీలేలో భారత పురుషుల జట్టు గోల్డ్
టోర్నీ చివరి ఈవెంట్ అయిన పురుషుల 4×400మీటర్ల రీలేలో భారత జట్టు సంతోష్ కుమార్ తమిళరసన్, విశాల్ టీకే, ధర్మవీర్ చౌధరి, మను టీఎస్ లతో కూడి ఉన్న క్వార్టెట్ 3:05.58 టైమ్ తో రికార్డ్ నమోదు చేస్తూ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. వియత్నాం జట్టు 3:06.20 టైమ్ తో రజతం, ఆసియా బయోమెడికల్ జట్టు 3:14.51 తో కాంస్యం గెలుచుకుంది.
ఈ టోర్నమెంట్లో భారత్ అథ్లెట్లు మొత్తంగా 12 గోల్డ్, 3 సిల్వర్, 1 బ్రాన్జ్ పతకం గెలుచుకుని, ఆసియా అథ్లెటిక్స్‌లో తమ హవాను మరోసారి రుజువు చేశారు. అనేక విభాగాల్లో డబుల్ పోడియం ఫినిష్‌లు రావడం విశేషం.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!