రికార్డ్ స్థాయిలో 5 లక్షల మందితో యోగాడే నిర్వహించనున్నాం: హోం మంత్రి అనిత
- June 10, 2025
విశాఖపట్నం: విశాఖలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ యోగాడేకి హాజరవుతారని తెలిపారు.
విశాఖ బీచ్ రోడ్డులో 5 లక్షల మందితో యోగా డే రికార్డ్ స్థాయిలో జరుగుతుందని అనిత తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా చేయించేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేశారని అన్నారు. బీచ్ రోడ్డులో 33 బ్లాకుల్లో యోగా డే జరుగుతుందని తెలిపారు.
వర్షాలు కురిసినా సరే ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించామని అనిత చెప్పారు. వర్షం పడితే ఆల్టర్నేట్ వేదికగా ఆంధ్రా యూనివర్సిటీలో గ్రౌండ్స్ ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. యోగాడే నిర్వహణకు ప్లాన్ ఏ, ప్లాన్ బీని కూడా వేసుకున్నామని చెప్పారు.
అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమర్థవంతంగా జరుపుతామని అనిత తెలిపారు. 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 11వ యోగ దినోత్సవాన్ని విశాఖలో జరిపి సరికొత్త రికార్డు నెలకొల్పుతామని చెప్పారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!