ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ హఠాన్మరణం
- June 11, 2025
హైదరాబాద్: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
గోపిచంద్ హీరోగా ‘యజ్జం’ మూవీతో దర్శకుడుగా పరిచయం అయ్యారు ఏఎస్ రవికుమార్. ఆ తరువాత బాలకృష్ణతో ‘వీరభద్ర’, సాయి ధరమ్ తేజ్‌తో ‘పిల్లా నువ్వులేని జీవితం’, గోపిచంద్‌తో ‘సౌఖ్యం’, నితిన్‌తో ‘ఆటాడిస్తా’ వంటి సినిమాలు తెరకెక్కించారు. చివరిగా రాజ్‌తరుణ్‌తో ‘తిరగబడరా సామి’ సినిమాని తీశారు.
గత కొన్నాళ్లుగా ఏఎస్ రవికుమార్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఆయన చేసిన చివరి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోవడంతో మానసికంగా ఒత్తిడికి లోనయ్యారని అంటున్నారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!