దుబాయ్ మెట్రో బ్లూ లైన్: మొదటి స్టేషన్, రైలు సామర్థ్యం..పుల్ డిటైల్స్..!!
- June 11, 2025
దుబాయ్: దుబాయ్ మెట్రో తన సరికొత్త నెట్‌వర్క్ బ్లూ లైన్ వైపు వేగంగా దూసుకుపోతోంది.. దాని భవిష్యత్ డిజైన్, ప్రపంచంలోనే ఎత్తైన మెట్రో స్టేషన్, దుబాయ్ క్రీక్‌ను దాటే మొదటి మెట్రో లైన్ అంచనాలు తదితర విషయాలను వెల్లడించారు. మరో నాలుగు ఏళ్లలో ఈ కొత్త నెట్‌వర్క్ గ్రీన్ లైన్, రెడ్ లైన్‌ను కలుపుతుంది. ఇది నివాస ప్రాంతాలను దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లో కనెక్ట్ చేస్తుంది. బ్లూ లైన్ సేవలు అందించే రోడ్ల వెంట ట్రాఫిక్ రద్దీని 20 శాతం తగ్గిస్తుంది. ఇది ప్రధాన పట్టణ కేంద్రమైన దుబాయ్ సిలికాన్ ఒయాసిస్‌కు కూడా కలుపుతుంది. దుబాయ్ పాలకుడు పునాది రాయి వేయడం ద్వారా ఎమిరేట్ రవాణా రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. రూట్ నుండి డిజైన్ వరకు, పార్కింగ్ వరకు కీలక అంశాల వరకు వివరాలు మీ కోసం..
స్టేషన్లు, మార్గం
బ్లూ లైన్ సెంటర్ పాయింట్ స్టేషన్ వద్ద రెడ్ లైన్ , క్రీక్ స్టేషన్ వద్ద గ్రీన్ లైన్ కు కనెక్ట్ అవుతుంది. ఇందులో 14 స్టేషన్లు ఉన్నాయి. ఇవి రెండు మార్గాలుగా డివైడ్ చేశారు.
10 స్టేషన్లతో కూడిన మొదటి మార్గం.. గ్రీన్ లైన్ యొక్క క్రీక్ స్టేషన్ నుండి ప్రారంభమై, దుబాయ్ ఫెస్టివల్ సిటీ, దుబాయ్ క్రీక్ హార్బర్, రాస్ అల్ ఖోర్ గుండా వెళుతుంది. తరువాత ఇంటర్నేషనల్ సిటీ 1 కి చేరుకుంటుంది. ఇందులో భూగర్భ ఇంటర్‌చేంజ్ స్టేషన్ ఉంటుంది. ఈ మార్గం ఇంటర్నేషనల్ సిటీ 2, 3 దిశగా కొనసాగుతుంది. దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ వరకు, అకాడెమిక్ సిటీ వరకు ఉంటుంది.
నాలుగు స్టేషన్లతో కూడిన రెండవ మార్గం.. రెడ్ లైన్ యొక్క సెంటర్ పాయింట్ స్టేషన్ వద్ద ప్రారంభమై.. మిర్దిఫ్, అల్ వార్కా గుండా వెళుతుంది. ఇంటర్నేషనల్ సిటీ 1 ఇంటర్‌చేంజ్ స్టేషన్ వద్ద ముగుస్తుంది.
రద్దీని తగ్గించడం, కమ్యూనిటీలను కనెక్ట్ చేయడం
బ్లూ లైన్ మరొక ఆవిష్కరణ మాత్రమే కాదు.. నివాసితులకు అత్యంత అవసరమైన చోట సేవ చేయడానికి ఇది వ్యూహాత్మకంగా రూపొందించబడింది. ప్రయాణ సమయాన్ని తగ్గించడం, రద్దీని తగ్గించడం, ముఖ్యమైన ప్రాంతాలను ఒకదానితో ఒకటి అనుసంధానించడం ద్వారా కొత్త నెట్‌వర్క్ రోజువారీ ప్రయాణికుల జీవితాన్ని సులభతరం చేయడానికి ప్రయత్నిస్తుంది.
బ్లూ లైన్ 2029 నాటికి 50,000 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయ విద్యార్థులకు వసతి కల్పించే విధంగా అంచనా వేయబడిన దుబాయ్ అకాడమీ సిటీ, ఎమిరేట్‌లోని ప్రధాన పట్టణ కేంద్రాలలో ఒకటైన దుబాయ్ సిలికాన్ ఒయాసిస్‌తో కలుపుతుంది. కొత్త లైన్ దాని సేవలందించే మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని 20 శాతం తగ్గిస్తుంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, తొమ్మిది కీలక ప్రాంతాల మధ్య డైరెక్ట్ కనెక్షన్‌ను అందిస్తూ.. ప్రయాణం 10 - 25 నిమిషాల మధ్య మాత్రమే పడుతుంది. '20 నిమిషాల నగరాన్ని' సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్న దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్ ఆకాంక్షలను కూడా ఈ ప్రాజెక్ట్ నెరవేర్చనుంది.
పరిమాణం, ప్రయాణీకుల సామర్థ్యం
దుబాయ్ మెట్రో బ్లూ లైన్ 30 కి.మీ. విస్తరించి ఉంది. దాని మొదటి మార్గంలో 21 కి.మీ. ఉండగా, రెండవ మార్గంలో 9 కి.మీ మేర ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, దుబాయ్ మొత్తం రైలు నెట్‌వర్క్ మొత్తం 131 కి.మీ.లకు విస్తరిస్తుంది. ఇందులో 78 స్టేషన్లు, 168 రైళ్లు ఉంటాయి. స్టేషన్ల స్థాయి ఆధారంగా, ఇది రోజుకు గరిష్టంగా 850,000 మంది ప్రయాణికులకు సేవలు అందించగలదు. 2030 నాటికి రైడర్ల సంఖ్య రోజుకు 200,000కు చేరుకుంటుందని, 2040 నాటికి 320,000 మంది రోజువారీ ప్రయాణికులకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
పేరు పెట్టే హక్కులు, మొదటి స్టేషన్
బ్లూ లైన్‌లోని స్టేషన్‌కు మీ బిజినెస్ బ్రాండ్ ను పేరుగా పెట్టవచ్చు. 2029లో అధికారికంగా ప్రారంభించినప్పటి నుండి పదేళ్ల పాటు మొదటి స్టేషన్, ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు ఎమ్మార్ పేరు పెట్టే హక్కులను పొందినట్టు ప్రకటించారు. తదుపరి దశలో బ్లూ లైన్ వెంట ఉన్న ఇతర స్టేషన్లకు పేరు పెట్టే హక్కులకు సంబంధించిన ప్రకటనలు ఉంటాయి. నెట్‌వర్క్‌లోని మొదటి స్టేషన్ ప్రపంచంలోనే ఎత్తైన మెట్రో స్టేషన్. దీనిని బుర్జ్ ఖలీఫా తర్వాత ప్రఖ్యాత అమెరికన్ ఆర్కిటెక్చరల్ సంస్థ స్కిడ్‌మోర్, ఓవింగ్స్ & మెర్రిల్ (SOM) రూపొందించింది. ఎత్తైన గోడలపై గాజు పైకప్పుల ద్వారా సహజ కాంతిని ప్రసరించనుంది. మట్టి, రాయి, లోహపు కలయికతో ఈ డిజైన్ ను రూపొందించారు. దీని వినూత్న రూపం 'భవిష్యత్తుకు ప్రవేశ ద్వారం' అనే దుబాయ్ దార్శనికతను ప్రతిబింబిస్తుంది.
కమ్యూనిటీ ఆధారిత లక్షణాలు
స్టేషన్లలో పార్కింగ్ స్థలాలు, ఎలక్ట్రిక్ స్కూటర్ రాక్‌లు, టాక్సీ స్టాండ్‌లు, ప్రైవేట్ కార్ డ్రాప్ ఆఫ్ మరియు పికప్ కోసం ప్రాంతాలు, అలాగే ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల కోసం అందుబాటులో ఉండే పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పాయింట్లను కూడా అందిస్తుంది. ఇతర రవాణా విధానాలతో సజావుగా అనుసంధానించడానికి రూపొందించబడింది.
బ్లూ లైన్‌లో తొమ్మిది ఎలివేటెడ్ స్టేషన్లు, ఐదు భూగర్భ స్టేషన్లు ఉన్నాయి. ఎలివేటెడ్ స్టేషన్ల బాహ్య రూపకల్పన సముద్రపు షెల్ ఆకారంతో ప్రేరణ పొందింది. అయితే స్టేషన్ల లోపలి డిజైన్ వారసత్వం, భూమి, గాలి, అగ్ని, నీరు లాంటి ఏడు నేపథ్య మోడల్స్ ను ప్రతిబింబించేలా ఉంటుంది.
ఆర్థిక ప్రయోజనాలు
2040 నాటికి ఈ ప్రాజెక్ట్ 2.60 (ఖర్చు చేసిన ప్రతి దిర్హం కోసం ప్రయోజనాలలో దిర్హం2.60) బెనిపిట్-కాస్ట్ నిష్పత్తిని ఇస్తుందని అంచనా వేస్తున్నారు. 2040 నాటికి మొత్తం అంచనా వేసిన ప్రయోజనాలు Dh56.5 బిలియన్లను మించనున్నాయి. ఈ ప్రయోజనాలలో సమయంతోపాటు ఇంధనంలో గణనీయమైన ఆదా, ప్రమాదాలు తగ్గింపు, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ఉన్నాయి. బ్లూ లైన్ స్టేషన్ల సమీపంలోని భూమి, ఆస్తుల విలువను సెంటుకు 25 శాతం వరకు పెంచుతుందని కూడా భావిస్తున్నారు. ప్లాటినం కేటగిరీ సర్టిఫికేషన్ సాధించి, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పూర్తిగా పాటించిన దుబాయ్‌లోని మొట్టమొదటి రవాణా ప్రాజెక్ట్ కూడా ఈ నెట్‌వర్క్ అవ్వనుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!