అపార్ట్మెంట్లో వ్యక్తి మృతి
- July 13, 2016
బంగ్లాదేశ్‌కి చెందిన 31 ఏళ్ళ వ్యక్తి అల్ నహ్దా ఏరియాలోని ఓ అపార్ట్మెంట్లో చనిపోయి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అపార్ట్మెంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కి ఆ వ్యక్తి ఉరివేసుకుని చనిపోయాడు. అయితే ఇది ఆత్మహత్యా? లేదంటే ఎవరైనా చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారా? అన్నదానిపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి తమకు ఫోన్ కాల్ రావడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని పోలీసులు చెప్పారు. మృతుడు మరికొంతమందితో కలిసి ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడనీ, సహచరులు లేని సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వివరించారు. సన్నిహితులు, స్నేహితులకు సమాచారం అందించి, వారిని విచారిస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







