వెంకటేశ్ కొత్త లుక్ తో ..
- July 13, 2016
స్టీల్ సిటీ విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌గా పలు చిత్రాలు తెరకెక్కాయి. ఏడాదిన్నర నాటి ఎన్టీఆర్ చిత్రం 'టెంపర్' కూడా వైజాగ్ నేపథ్యంలోనే రూపొందింది. ప్రకృతి సొగసులకూ ఇక్కడ కొదువలేదు. దీంతో అందమైన దృశ్యాలను అందుబాటులోనే చిత్రీకరించాలనుకునే దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాన్స్‌గా వైజాగ్ మారిపోయింది. అందుకే ఇక్కడ చాలా సినిమాల షూటింగులు జరుగుతూ ఉంటాయి. ఇక విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమా సైతం ఇక్కడే మొదలుకాబోతోందని సమాచారం.
మాధవన్ నటించిన 'సాలా ఖడూస్'ను వెంకటేశ్‌తో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ స్టోరీ బాక్సింగ్ నేపథ్యంలో కొనసాగుతుంది. బాక్సింగ్ కోచ్ గా వెంకటేశ్ కొత్త లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ మూవీలో మరో కీలక పాత్ర మహిళా బాక్సర్. జాలర్ల కుటుంబానికి చెందిన ఓ యువతికి కథానాయకుడు బాక్సింగ్‌లో కోచింగ్ ఇచ్చి ఛాంపియన్‌గా నిలబెడతాడు. ఈ క్యారక్టర్‌కు ఎవర్ని సెలెక్ట్ చేశారో తెలీదు. నటనకు ప్రాధాన్యత ఉన్న ఈ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







