టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడుని కలిసిన ఎమ్మెల్సీ కవిత

- June 19, 2025 , by Maagulf
టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడుని కలిసిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌: తిరుపతి హతిరామ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కోరారు.

తెలంగాణలోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి గురువారం హైదరాబాద్‌లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఆమె మర్యాదపూర్వకంగా కలిసారు.

ఈ నెల 30న జరగనున్న హతిరామ్ బావాజీ జయంతిని పురస్కరించుకుని, బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించే అవకాశం కల్పించడంతో పాటు, నైవేద్యం సమర్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో త్వరలోనే హతిరామ్ బావాజీ పీఠం నిర్వాహకులు మరియు గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు.

హరిరామ్ బావాజీ మఠంలో పూజలు చేయడం, హారతి ఇవ్వడం వంటి అంశాలపై త్వరలో జరగనున్న సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

జయంతి రోజైన 30న ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు, నైవేద్యం సమర్పించేందుకు అనుమతి ఇస్తామని టీటీడీ చైర్మన్ హామీ ఇచ్చారు.

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com