టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆవిష్కరణ!!

- June 19, 2025 , by Maagulf
టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ఆవిష్కరణ!!

ఇంగ్లండ్-భారత్ టెస్ట్ సిరీస్‌కు కొత్త రూపు దక్కింది. ఇకపై ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను “టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ”గా పిలవనున్నారు.రెండు దశాబ్దాలకు పైగా తమ తమ దేశాలకు సేవలందించిన భారత బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్–ఇంగ్లాండ్ స్వింగ్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్ ల‌కు ఈ ట్రోఫీ రూపంలో అరుదైన గుర్తింపు ల‌భించింది.

ఈరోజు (జూన్ 19న) జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో సచిన్, ఆండర్సన్ కలిసి కొత్త ట్రోఫీతో ఫోటో దిగారు.ఈ కొత్త ట్రోఫీ రెండు దేశాల మధ్య ఉన్న క్రికెట్ వారసత్వానికి, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలవనుంది.

ఈ నేపధ్యంలో, ఇంతవరకు ఇంగ్లండ్‌లో జరిగిన భారత్ టెస్ట్ సిరీస్‌లకు వర్తించిన పటౌడి ట్రోఫీకి ముగింపు పలికారు.అయితే, మన్‌సూర్ అలీ ఖాన్ పటౌడి జ్ఞాపకార్థం ‘పటౌడి మెడల్’ అనే ప్రత్యేక అవార్డును ECB ప్రవేశపెట్టింది.ఇక నుంచి భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో విజేత జట్టు కెప్టెన్‌కు ఈ మెడల్ అందించనున్నారు.

ఈ సందర్భంగా…యువ భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ విలువైన సూచనలు చేశాడు. ఇంగ్లండ్ వాతావరణంలో ఆటగాళ్లు శాంతియుతంగా, ఓపికగా ఆడాలని….స్వింగ్, బౌన్స్‌కు తగిన విధంగా తమ ఆటను మలచుకోవాలని సూచించాడు.ఇక‌ జూన్ 20న లీడ్స్ వేదికగా జరగబోయే మొదటి టెస్ట్‌తో టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com