దుబాయ్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
- June 21, 2025
దుబాయ్: గల్ఫ్ ప్రవాస భారతీయుల విభాగం దుబాయి అధ్యక్షుడు ఎస్.వి.రెడ్డి నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎస్.వి.రెడ్డి మాట్లాడుతూ, “భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణలో గల్ఫ్ కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వారి కుటుంబాలను పరామర్శించి మద్దతు తెలిపారు.గల్ఫ్ కార్మికుల కోసం వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు,” అని తెలిపారు.
ఆ హామీని అమలు చేస్తూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిందని, దేశంలోనే ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు.
భారతదేశం అభివృద్ధి చెందాలంటే, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వేడుకలో దుబాయిలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం రాహుల్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు మరియు కేక్ కట్ చేసి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







