మస్కట్ నడిబొడ్డున కొత్త నాచురల్ పార్క్..!!
- June 21, 2025
మస్కట్: ఒమన్ రాజధాని నడిబొడ్డున ఒక కొత్త నాచురల్ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. మస్కట్ గవర్నరేట్‌లోని బౌషర్ సాండ్స్ ప్రాంతంలో సహజ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయనున్నారు. మస్కట్ మునిసిపాలిటీ, గృహనిర్మాణ మరియు పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. మస్కట్ అరుదైన సహజ ప్రకృతి నిలయంగా రూపొందించనున్నారు. దీర్ఘకాలిక పట్టణ ప్రణాళికలో భాగంగా ఈ పర్యావరణ ప్రాజెక్టును నిర్వహించనున్నారు.
సహజ పర్యావరణం, సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని డెవలప్ చేయనున్నారు. బౌషర్ సాండ్స్ సహజ స్థలాకృతిని తిరిగి రూపొందిస్తారు. “బౌషర్ సాండ్స్ పార్క్ ప్రాజెక్ట్ ‘వైటల్ మస్కట్’, ‘ప్రొడక్టివ్ మస్కట్’ ద్వారా ‘గ్రేటర్ మస్కట్’ దార్శనికతను ప్రతిబింబిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పర్యాటకాన్ని పెంచుతుందని, మస్కట్ అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







