మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలపై అరబ్ విదేశాంగ మంత్రులు ఆందోళన..!!
- June 21, 2025
అంకారా: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలతోపాటు ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం తీవ్రం కావడంపై అరబ్ విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. టర్కియేలోని ఇస్తాంబుల్‌లో అరబ్ విదేశాంగ మంత్రుల అత్యవసర సమావేశం సందర్భంగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) విదేశాంగ మంత్రుల సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని టర్కిష్ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ తెలిపారు.
గత శుక్రవారం నుండి ఇజ్రాయెల్..ఇరాన్ అణు సౌకర్యాలు, క్షిపణి స్థావరాలపై వైమానిక దాడులను చేస్తుంది. సైనికాధికారులు, అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌పై దురాక్రమణను ప్రారంభించింది. ఇజ్రాయెల్ దాడులకు టెహ్రాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించడం ద్వారా ప్రతిస్పందించింది. ఈ దాడులు ఉధృతి పెరగుతుందని, ప్రపంచ దేశాలు శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు చొరవ చూపాలని ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







