ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం: ఉద్యోగులను తరలిస్తున్న కంపెనీలు..!!
- June 23, 2025
యూఏఈ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదంతో.. ఆయా దేశాల్లో ఉన్న సంస్థలు ఈ ప్రాంతం నుండి తమ సిబ్బందిని తరలిస్తున్నాయని భద్రతా ప్రమాద సేవల సంస్థ ఇంటర్నేషనల్ SOS తెలిపింది. ఇది రియల్-టైమ్ ఇంటెలిజెన్స్, రిస్క్ అసెస్‌మెంట్ ప్రణాళికతో ఈ ప్రాంతాల్లో ఉన్న సంస్థలకు మద్దతుగా నిలుస్తున్నట్లు ఇంటర్నేషనల్ SOSలో సమాచార విశ్లేషణ ప్రాంతీయ భద్రతా డైరెక్టర్ గుల్నాజ్ ఉకాసోవా అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల నుండి మాత్రమే కాకుండా, పొరుగు దేశాల నుండి కూడా ఇప్పటికే అనేక సంస్థలు తమ ఉద్యోగులను తరలిస్తున్నాయని తెలిపారు.
అంతర్జాతీయ కంపెనీలు ఉద్రిక్త దేశాల నుండి ఉద్యోగులను తరలిస్తున్నప్పటికీ, యూఏఈ నుండి అలా చేయడం లేదని మరొక నిపుణుడు తెలిపారు. యూఏఈలోని కంపెనీలు తమ ఉద్యోగులను తరలిస్తున్నట్లు సమాచారం లేదని కంట్రోల్ రిస్క్స్ మిడిల్ ఈస్ట్ & ఆఫ్రికా మేనేజింగ్ పార్టనర్ టామ్ గ్రిఫిన్ అన్నారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితి అస్థిరంగా మారడంతో.. గుల్నాజ్ తమ క్లయింట్లకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారని చెప్పారు. ఇంటర్నేషనల్ SOS దుబాయ్ సహా 28 ప్రపంచ సహాయ కేంద్రాలను నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!