శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- June 23, 2025
తిరుమల: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కోనుగోలుకు టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కోనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచింది.
ఈ సదుపాయం ద్వారా భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించి త్వరితగతిన లడ్డూల కొనుగోలు ప్రక్రియ చేసేలా అవకాశం కల్పించడం జరిగింది.యూపీఐ చెల్లింపు సదుపాయం ద్వారా నగదు లేకుండా పారదర్శక లావాదేవీలు జరిగేలా టీటీడీ ఏర్పాటుచేసింది.
కియోస్క్ ద్వారా లడ్డూలు పొందే విధానం–భక్తులు లడ్డూ పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం వద్దకు వెళ్తారు.
యంత్రంలో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి:
1.దర్శన టికెట్ ఉన్నవారు
2.దర్శన టికెట్ లేనివారు
దర్శన టికెట్ ఉన్నవారు:
ఈ ఆప్షన్ ఎంచుకోండి.
టికెట్ వివరాలను యంత్రం ధృవీకరిస్తుంది.
టికెట్‌లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి రెండు అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.
దర్శన టికెట్ లేనివారు:
- ఈ ఆప్షన్ ఎంచుకుని సరైన ఆధార్ నంబర్ ఇవ్వాలి.
- ఈ మార్గం ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.
- సరైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి లావాదేవీలు పూర్తి చేయవచ్చు.
- చెల్లింపు అనంతరం ముద్రిత రసీదు అందుతుంది.
ఆ రసీదుతో లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్చు.
భక్తుల సౌకర్యార్థం టిటిడి ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి నుండి విశేష స్పందన లభిస్తోంది.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'