హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- June 24, 2025
హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం మరోసారి దేశస్థాయిలో తమ సేవా నిబద్ధతను చాటింది. ఢిల్లీలో జరిగిన 13వ పాస్‌పోర్టు సేవా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా 2024-25 సంవత్సరానికి గాను ‘సంస్కరణలు, ప్రజా సేవపట్ల నిబద్ధత’ విభాగంలో హైదరాబాద్ ఆర్పీవోకు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డును కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా అందించగా, హైదరాబాద్ ఆర్పీవో అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ, ఆర్పీవో తరఫున ఈ గౌరవాన్ని స్వీకరించారు. ప్రజల అవసరాల మేరకు సేవల సరళీకరణ, సమర్థవంతమైన కార్యాచరణకు ఇది గుర్తింపుగా నిలిచింది.
తెలంగాణ పోలీసులకు కేంద్రం ప్రశంస
పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియలో వేగవంతమైన, పారదర్శక సేవలందించినందుకు తెలంగాణ పోలీసు విభాగానూ ఈ సందర్భంగా అవార్డుతో సత్కరించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన డీజీ బత్తుల శివధర్ రెడ్డి ఈ అవార్డును స్వీకరించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి, పౌరులకు నాణ్యమైన సేవలు అందించడంలో తెలంగాణ పోలీసులు చూపిన చొరవకు ఇది ఫలితంగా భావిస్తున్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా ఈ గుర్తింపు తోడ్పడనుంది.
పాస్‌పోర్టు సేవల విభాగంలో తెలంగాణకే రెండు గౌరవాలు
ఈ అవార్డులతో తెలంగాణ రాష్ట్రానికి రెండు కీలక గౌరవాలు దక్కాయి. ఒకటి ప్రజా సేవలలో ముందుండే హైదరాబాద్ ఆర్పీవోకు, మరొకటి పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనలో నాణ్యతను ప్రదర్శించిన రాష్ట్ర పోలీసులకు. ఈ అవార్డులు రాష్ట్రంలో ప్రశాసన వ్యవస్థలో పారదర్శకత, సమర్థత ఎంత పెరిగిందో తెలుపుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రంతో సమన్వయం, సాంకేతిక వినియోగం, సేవా నిబద్ధతలో ఈ గుర్తింపులు తెలంగాణను దేశంలో ఆదర్శంగా నిలబెట్టాయి.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'