అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- June 24, 2025
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా పలకొల్లు పట్టణానికి చెందిన 23 ఏళ్ల యువతి జ్ఞానవి డంగేటి, భారతీయ మహిళల ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రతినిధ్యం వహిస్తూ అరుదైన ఘనతను సాధించింది. ఆమెను అమెరికాలోని ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ (TSI) నిర్వహించే 2029 అంతరిక్ష యాత్రకు వ్యోమగామిగా అధికారికంగా ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది.
TSI చేపట్టే ఈ అంతరిక్ష మిషన్ 2029లో జరగనుండగా, ఆమె 2026 నుంచి మూడు సంవత్సరాల పాటు శిక్షణ పొందనుంది. ఈ శిక్షణలో స్పేస్‌షిప్ ఆపరేషన్స్, ఫ్లైట్ సిమ్యూలేషన్, మెడికల్-సైకాలజికల్ ట్రైనింగ్, లైఫ్ సపోర్ట్, సర్వైవల్ టెక్నిక్స్ వంటి అత్యంత క్లిష్టమైన అంశాలు ఉంటాయి.
ఈ మిషన్‌కు NASA మాజీ వ్యోమగామి కల్నల్ విలియమ్ మెక్ ఆర్థర్ జూనియర్ ప్రధాన వ్యోమగామిగా వ్యవహరించనున్నారు. మొత్తం ఐదు గంటల వ్యాసంలో నిర్వహించే ఈ ఆర్బిటల్ ఫ్లైట్, శాస్త్రీయ ప్రయోగాలు, మానవ అంతరిక్ష ప్రయాణ అభివృద్ధికి దోహదపడే విధంగా రూపొందించబడుతోంది.
విజయం వెనుక ప్రయాణం..
ప్రస్తుతం కువైట్‌లో నివసిస్తున్న పద్మశ్రీ–శ్రీనివాస్ దంపతుల కుమార్తె అయిన జ్ఞానవికి చిన్ననాటి నుంచే అంతరిక్షంపై గొప్ప ఆసక్తి. గోదావరి జిల్లాలో పాఠశాల విద్య అనంతరం, పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ పూర్తిచేసింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







