భూమి అంతర్భాగంపై పరిశోధనలకు కేంద్రంగా ఒమన్ భౌగోళిక నిర్మాణం..!!
- June 25, 2025
మస్కట్: పది లక్షల సంవత్సరాలుగా భూమి ఉపరితలాన్ని నెమ్మదిగా పైకి లేపుతున్న ఒమన్ కింద దాగి ఉన్న భౌగోళిక నిర్మాణాన్ని ఒక కొత్త శాస్త్రీయ అధ్యయనం గుర్తించింది. ఈ ఆవిష్కరణ సుల్తానేట్‌ను భూమి అంతర్భాగాన్ని అర్థం చేసుకోవడంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా మార్చుతుందని భావిస్తున్నారు. డాని ప్లూమ్ అని పిలువబడే ఈ నిర్మాణాన్ని "ఫాంటమ్" మాంటిల్ ప్లూమ్ ( భూమి లోపల లోతు నుండి పైకి లేచే వేడి రాతి స్తంభం) అని తెలిపారు.
ఈ నిశ్శబ్ద శక్తి ఈశాన్య ఒమన్‌లోని సల్మా పీఠభూమి కింద ఉందని గుర్తించారు. ఈ నెలలో ఈ పరిశోధనలు అంతర్జాతీయ జర్నల్ ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ లెటర్స్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. చురుకైన అగ్నిపర్వత ప్రాంతాల వెలుపల శాస్త్రవేత్తలు ఇటువంటి నిర్మాణాన్ని గుర్తించడం ఇదే మొదటిసారిఅని తెలిపారు.
అగ్నిపర్వతాలు లేవు, కానీ నేల పైకి లేస్తోంది
హవాయి లేదా ఐస్లాండ్ వంటి ప్రాంతాలలో కనిపించే అగ్నిపర్వత ప్లూమ్‌ల మాదిరిగా కాకుండా.. డాని ప్లూమ్ అమగ్మాటిక్. ఇది విస్ఫోటనం చెందదు లేదా కనిపించే అగ్నిపర్వతాలను సృష్టించదని తెలిపారు.. ఇది ఉపరితలం క్రింద దాదాపు 200 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నారు. ఉష్ణోగ్రతలు చుట్టుపక్కల ఉన్న మాంటిల్ రాక్ కంటే 100 నుండి 300°C వేడిగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. పాలియోసిన్-ఇయోసిన్ కాలంలో (దాదాపు 50 మిలియన్ సంవత్సరాల క్రితం -) దట ఏర్పాటు చేయబడిన భౌగోళిక పొరలు వాటి ప్రారంభ స్థానాల కంటే 2,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో కొనుగొన్నారు. ఈ మార్పు చాలా నెమ్మదిగా జరిగినప్పటికీ, ప్రస్తుత సంవత్సరానికి ఒక మిల్లీమీటర్ కంటే తక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు.
ఒమన్‌లో భూకంప ఇమేజింగ్
ఒమన్ భౌగోళిక భౌతిక పర్యవేక్షణ నెట్‌వర్క్ నుండి భూకంప తరంగ డేటాను ఉపయోగించి ప్లూమ్ ను గుర్తించారు. ఈ ప్రాంతం గుండా ప్రయాణించే ధ్వని తరంగాలు ఊహించిన దానికంటే భిన్నంగా కదులుతున్నాయని పరిశోధకులు గమనించారు. ఇది భూగర్భంలో వేడిగా, తక్కువ సాంద్రత కలిగిన పదార్థం పెద్ద ద్రవ్యరాశిని సూచిస్తుంది. డాక్టర్ సిమోన్ పిలియా నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధనా బృందం, ఖండాంతర భూభాగం కింద ఈ రకమైన మొదటి ప్లూమ్‌ను గుర్తించింది.
“భూమి యొక్క మాంటిల్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి మన అనేక అంచనాలను సవాలు చేసే నిర్మాణం ఇది” అని డాక్టర్ పిలియా అన్నారు. “అగ్నిపర్వత కార్యకలాపాలు లేని చోట కూడా లోతైన వేడి మరియు పీడనం ప్రకృతి దృశ్యాన్ని రూపొందిస్తున్నాయని ఇది చూపిస్తుంది.” అని వివరించారు.
ఈ ఆవిష్కరణ ఒమన్ భౌగోళిక కార్యకలాపాలపై కొత్త వెలుగును ప్రసరింపజేస్తుందన్నారు. ప్రాంతీయ మార్పు, క్రస్టల్ కదలిక నమూనాలను వివరించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ప్లూమ్ ఎటువంటి ప్రత్యక్ష ప్రమాదాన్ని కలిగించనప్పటికీ, దాని ఉనికి ఈశాన్యంలోని మక్రాన్ సబ్‌డక్షన్ జోన్‌తో సహా ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక టెక్టోనిక్ ప్రక్రియలకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు.
భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇలాంటి “దెయ్యం” ప్లూమ్‌లు ఇతర ఖండాల కింద ఉండవచ్చని, కానీ వాటి ఉపరితల కార్యకలాపాలు లేకపోవడం వల్ల గుర్తించేందుకు వీలు కావడం లేదన్నారు. డాని ప్లూమ్ ఆవిష్కరణ అరేబియా ద్వీపకల్పం, అంతకు మించి మరింత పరిశోధనలకు దోహదం చేస్తుందని తెలిపారు.
దాదాపు 50 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ ప్లేట్ మారడానికి ప్లూమ్ యొక్క వేడి దోహదపడిందని ఆధారాలు సూచిస్తున్నాయరిచ ఈ సంఘటన హిమాలయాల ఏర్పాటుకు కూడా దోహదపడిందని అధ్యయన సందర్భంగా ఊహించారు. అయితే ఈ లింక్‌ను నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం అని డాక్టర్ పిలియా అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!