పాన్ కార్డులో మీ పేరులో తప్పు ఉంటే ఈ తేదీలోగా మార్చుకోండి..

- June 27, 2025 , by Maagulf
పాన్ కార్డులో మీ పేరులో తప్పు ఉంటే ఈ తేదీలోగా మార్చుకోండి..

న్యూ ఢిల్లీ: పాన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ అప్‌డేట్..మీ పాన్ కార్డు ఇంకా అప్‌డేట్ చేసుకోలేదా? అయితే, ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి.. పాన్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన  డాక్యుమెంట్లలో ఒకటి.. పాన్ కార్డ్ ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలను పూర్తి చేయవచ్చు.

ఇది లేకుండా, ఐటీఆర్ దాఖలు చేయడం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం లేదా లోన్ తీసుకోవడం వంటివి చేయలేం.పాన్ కార్డుతో చాలా పనులకు ఉపయోగపడుతుంది.లేదంటే అనేక ఆర్థిక పరమైన ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది.

సాధారణంగా పాన్ కార్డ్‌ను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. కొత్త నిబంధన ప్రకారం.. కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు కూడా తప్పనిసరి. అయితే, ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ దాఖలు చేసేందుకు చివరి తేదీ 15 సెప్టెంబర్ 2025గా నిర్ణయించింది. అంతకన్నా ముందు, సరైన సమాచారంతో మీ పాన్ కార్డును అప్‌డేట్ చేయండి.

పేరు, పుట్టిన తేదీ లేదా ఫోన్ నంబర్ వంటి ఏవైనా తప్పులను సరిదిద్దండి. కార్డులోని ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే.. మీకు రావాల్సిన ప్రయోజనాలు పొందలేరు. పాన్ కార్డులోని పేరుకు సంబంధించిన మార్పులు చేయాలనుకుంటే.. పాన్ కార్డును ఎలా అప్‌డేట్ చేయాలి? ఎన్ని రోజుల్లో మీరు అప్‌డేట్ చేసిన పాన్ కార్డును పొందవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పాన్ కార్డులో పేరు ఎప్పుడు మార్చాలి:
1. పేరు స్పెల్లింగ్‌లో తప్పు ఉన్నప్పుడు..
2. అధికారికంగా పేరు మార్చినప్పుడు..
3. పెళ్లి తర్వాత ఇంటిపేరు మారినప్పుడు

పాన్ కార్డులో పేరు మార్చుకోవాలంటే?
1. పాన్ కార్డ్‌లో ఆన్‌లైన్‌లో మార్పుల కోసం NSDL అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి.
2. మీరు పాన్ కార్డ్ మార్పు కోసం ఒక ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది.
3. ఫారమ్ మార్పు వివరాలు మినహా అవసరమైన అన్ని వివరాలను నింపండి.
4. పేరు మార్పుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించండి.
5. పెళ్లి తర్వాత ఇంటిపేరు మారితే.. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా సమర్పించాలి.
6. సబ్మిట్ బటన్ ట్యాప్ చేశాక డిపార్ట్‌మెంట్ ద్వారా పాన్ కార్డ్ అప్‌డేట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com