బహ్రెయిన్ పౌరుల తరలింపు విజయవంతం..!!

- June 28, 2025 , by Maagulf
బహ్రెయిన్ పౌరుల తరలింపు  విజయవంతం..!!

మనామా: మిడిలీస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్ చేపట్టిన పౌరుల తరలింపు విజయవంతమైంది.విదేశాలలో చిక్కుకుపోయిన బహ్రెయిన్ పౌరులందరినీ విజయవంతంగా తిరిగి రప్పించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ దేశాలలో వైమానిక ప్రాంతాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి తెరిచిన తర్వాత ఇది సాధ్యమైందని ప్రకటించింది.

కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాల మేరకు..క్రౌన్ ప్రిన్స్,ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సూచనల ప్రకారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. బహ్రెయిన్ జాతీయ విమానయాన సంస్థ గల్ఫ్ ఎయిర్ చివరి ఫ్లైట్స్ తుర్క్మెనిస్తాన్ నుండి మనామా చేరుకున్నాయి.వచ్చిన బృందంలో ఇరాన్‌ నుండి వచ్చిన 203 మంది పౌరులు ఉన్నారు.అలాగే, ప్రస్తుత పరిస్థితి కారణంగా వైమానిక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసిన వివిధ దేశాల నుండి 103 మంది ఇతర పౌరులు తిరిగి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

మొత్తంగా.. తొమ్మిది గల్ఫ్ ఎయిర్ విమానాలు, 37 బస్సులు భూ మార్గాల ద్వారా సమన్వయ ప్రయత్నాల ద్వారా 2,586 మంది బహ్రెయిన్ పౌరులను ఇరాన్ నుండి స్వదేశానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సహాయం చేసినందుకు గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలకు, ఇరాక్, తుర్క్మెనిస్తాన్ ప్రభుత్వాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com