సౌదీ అరేబియా రీ ఓపెన్.. డైలీ 1,300కి పైగా ఫైట్ సర్వీసులు..!!

- June 28, 2025 , by Maagulf
సౌదీ అరేబియా రీ ఓపెన్.. డైలీ 1,300కి పైగా ఫైట్ సర్వీసులు..!!

రియాద్: మిడిలీస్ట్ లో ఉద్రిక్తతలు తగ్గడంతో సౌదీ అరేబియా తన వైమానిక ప్రాంతాన్ని తెరిచింది.దాంతో సగటున 1,330 కంటే ఎక్కువ డైలీ ఫ్లైట్స్ సర్వీసులు సౌదీ వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించుకున్నాయి.ఇది మిడిలీస్ట్ సంక్షోభానికి ముందు ట్రాఫిక్ స్థాయిల కంటే దాదాపు రెట్టింపు సంఖ్య అని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) తెలిపింది.

ఈ అదనపు విమానాలు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ప్రమాణాలకు అనుగుణంగా, అత్యాధునిక సాంకేతికతలు, కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌ల మద్దతుతో సురక్షితంగా నిర్వహించబడ్డాయని పేర్కొంది. సౌదీ తన గగనతల సామర్థ్యాన్ని విస్తరించిందని, అధునాతన నావిగేషనల్ సిస్టమ్‌ల ద్వారా విమాన మార్గాలను ఆప్టిమైజ్ చేస్తుండటంతో ఈ ఘనత సాధ్యమైందని తెలిపింది.

సౌదీ అరేబియా ఎయిర్ నావిగేషన్ నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతనమైనదని తెలిపింది. ఇందులో 20 నియంత్రణ టవర్లు, 15 రంగాలను కవర్ చేసే రెండు ప్రాంతీయ నియంత్రణ కేంద్రాల,10 అప్రోచ్ నియంత్రణ కేంద్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1,200 కంటే ఎక్కువ నావిగేషన్ పరికరాలు మోహరించారు. వీటిని 700+ సర్టిఫైడ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సహా 1,900 కంటే ఎక్కువ విమానయాన నిపుణులు విధులను నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com