క్యాబ్ ఛార్జీల పెంపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- July 02, 2025
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రయాణాల కోసం ఎక్కువగా వినియోగించబడే క్యాబ్ సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. డిమాండ్‌కు అనుగుణంగా క్యాబ్ రైడ్ ఛార్జీల్లో మార్పులకు అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో క్యాబ్ చార్జీలు పెంచుకోవచ్చని, అలాగే రద్దీ తక్కువగా ఉండే సమయంలో ఛార్జీలు తగ్గించవచ్చని స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించింది.కొత్త నిబంధనల ప్రకారం ఆఫ్ పీక్, రద్దీ తక్కువగా ఉన్న సమయంలో బేస్ ఛార్జ్ కన్నా 50 శాతం తక్కువగా ఉండాలని, అలానే పీక్ అవర్స్‌లో ఈ మొత్తాన్ని 200 శాతం వరకు అనగా రెట్టింపు చేసుకునేందుకు అనుమతించింది.అలానే 3కిలో మీటర్ల లోపు దూరానికి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదని తెలిపింది. అలానే రాపిడో, ఓలా, ఉబర్ వంటి రైడ్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ ప్రైవేట్ మోటార్ సైకిల్స్‌ను వినియోగించుకునేందుకు అనగా బైక్ ట్యాక్సీలకు కేంద్రం పచ్చ జెండా ఊపింది.
అదనపు ఛార్జీలు
కొత్త నిబంధనల ప్రకారం రైడ్ ఛార్జీలు పికప్ పాయింట్ నుంచి డ్రాప్ లోకేషన్ వరకు మాత్రమే వర్తించేలా ఉండాలి. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం సూచించింది. అలానే యాప్‌లో డ్రైవర్ రైడ్ అంగీకరించిన తర్వాత సరైన కారణం లేకుండా దాన్ని క్యాన్సిల్ చేస్తే, రైడ్ ఛార్జీలో సుమారు 10 శాతం పెనాల్టీ విధిస్తారు. ఇది గరిష్టంగా 100 రూపాయలు ఉండనుంది. ఈ మొత్తాన్ని రైడ్ ప్లాట్పామ్, డ్రైవర్ మధ్యన సమానంగా షేర్ చేస్తారు. అలానే సరైన కారణం లేకుండా రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే ప్రయాణికుడికి కూడా ఇదే పెనాల్టీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.
వివిధ వర్గాల వాహనాలకు సంబంధించి
డ్రైవర్ల సంక్షేమం కోసం కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. రైడింగ్ ప్లాట్‌ఫామ్ ఓనర్లు తమతో జాయిన్ అయిన ప్రతి డ్రైవర్‌కు కనీసం రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని కచ్చితంగా అందించాలని సూచించింది. అలానే కొత్త నిబంధనల ప్రకారం, ఆటో రిక్షాలు, బైక్ టాక్సీలు సహా వివిధ వర్గాల వాహనాలకు సంబంధించి బేస్ ఛార్జీలను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. ప్రస్తుతం ఇవి అధికారికంగా అగ్రిగేటర్ పాలసీ ఆయా యాప్స్ యాజమాన్యానం కింద ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్‌లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







