రంగ రంగ వైభవంగా కళామందిర్ 17వ వార్షికోత్సవ వేడుక
- July 08, 2025
హైదరాబాద్: కళామందిర్ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవాలను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హైదరాబాదులో అట్టహాసంగా నిర్వహించారు.ఈ వార్షికోత్సవ వేడుక రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు, వ్యాపార నిపుణులు, సామాజిక సేవకర్తలు, కళామందిర్ ఫౌండేషన్ నిర్వాకులతో కన్నుల పండుగగా జరిగింది.
ఈ వేడుకలో సినీ నటుడు కమెడియన్ అలీ మాట్లాడుతూ.. మనం ఎంతకాలం బతకామని కాదు, ఎంత సేవ చేసాము అనేదే ముఖ్యం అలాగే కళామందిర్ బ్రదర్స్ కూడా ఎన్ని బ్రాంచీలు పెట్టామని కాదు, ఎంతమందికి సేవ చేసాము అనేదే వారికి ముఖ్యమన్నారు. ప్రతి సంవత్సరం కళామందిర్ వార్షికోత్సవ వేడుకను ఎంతో బ్రహ్మాండంగా చేస్తూ.. ఎంతోమంది దివ్యాంగులకు సేవ చేస్తారు. ఆర్థిక సాయం చేస్తారు అందుకేనేమో కళామందిర్ ఇలా వెలిగిపోతుంది అని అన్నారు.
ప్రముఖ రచయిత బివిఎస్ రవి మాట్లాడుతూ.. ముందుగా కళామందిర్ ఫౌండర్ ప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపుతూ...దినదిన ప్రవర్తమానంగా స్టాక్ మార్కెట్లో కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు అని అన్నారు.ఇక కళామందిర్ ఇలా దేదీప్యమానంగా వెలగడానికి మహిళలే కారణమని.. అందులో భాగంగా ప్రసాద్ వెన్నంటి ఉండే తమ కుటుంబంలోని ఆరు మంది మహిళలతో పాటు కళామందిర్ కుటుంబంలో ఉన్న మహిళలు కూడా కారణమని అన్నారు.
సినీ నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ కళామందిర్ వేడుక చాలా బ్రహ్మాండంగా, కన్నుల పండుగగా ఉందని అన్నారు.అలాగే ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ్ గారు వేడుక గురించి చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది కచ్చితంగా ఈ వేడుకలో భాగస్వామ్యం కావాలని అనుకున్నట్లు తెలిపారు. కళామందిర్ బిజినెస్ పరంగా ఎదగడమే కాదు ఎంతోమందికి సేవ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక బ్రాంచ్ తో మొదలైన కళామందిర్ ప్రయాణం నేడు దేశవ్యాప్తంగా 60 బ్రాంచ్ లకు చేరడం అంటే అది కళ్యాణ్, ప్రసాద్ గార్ల కృషి పట్టుదల అన్నారు.
డైరెక్టర్ బాబి కొల్లి మాట్లాడుతూ ఇలాంటి బర్త్ డేలు ప్రసాద్ గారు వంద సంవత్సరాలు జరుపుకోవాలని, ఖచ్చితంగా జరుపుకుంటారు అన్నారు. ప్రసాద్ కావాలంటే ఏ దుబాయిలోనో కోట్లు ఖర్చుపెట్టి జన్మదిన వేడుకలు చేసుకోవచ్చు కానీ, గత 17 సంవత్సరాలుగా కళామందిర్ కుటుంబ సభ్యులతో.. ఎంతోమంది దివ్యాంగులకు సేవలందిస్తూనే తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అది ఆయన గొప్పతనం అన్నారు.కచ్చితంగా ప్రసాద్ చేసే సేవా కార్యక్రమాలు అన్ని ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు.
సినీ నటుడు శ్రీ విష్ణు మాట్లాడుతూ చాలామంది డబ్బు సంపాదిస్తారు, చదువుకుంటారు గొప్ప గొప్ప ప్రదేశాలకు వెళ్తారు..కానీ ఇలా సేవ చేయాలని చాలా తక్కువ మందికి అనిపిస్తుంది. అందుకు ప్రసాద్ హృదయం చాలా గొప్పది అన్నారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









