భారత్ నుంచి పేపర్ దిగుమతులపై GCC యాంటీ డంపింగ్ విచారణ..!!
- November 03, 2026
రియాద్: భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు జరుగుతున్న పేపర్ దిగుమతులపై గల్ఫ్ సహకార మండలి (GCC) యాంటీ డంపింగ్ విచారణ ప్రారంభించింది. భారత్‌తో పాటు చైనా, థాయ్‌లాండ్ నుంచి దిగుమతి అవుతున్న పేపర్ ఉత్పత్తులపైనా ఈ విచారణ చేపట్టాలని GCC శాశ్వత కమిటీ నిర్ణయించింది. రోల్స్ రూపంలో లేదా దీర్ఘచతురస్రాకార, చతురస్రాకార షీట్ల రూపంలో దిగుమతి అవుతున్న కోటింగ్ చేయని రైటింగ్, ప్రింటింగ్, గ్రాఫిక్ పేపర్ ఈ విచారణ పరిధిలోకి వస్తుంది.
అంతర్జాతీయ వాణిజ్యంలో హానికరమైన వాణిజ్య పద్ధతులపై పనిచేసే GCC సాంకేతిక విభాగం సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, విచారణ విధివిధానాలతో కూడిన నోటీసును 2026 నవంబర్ 2న ప్రచురించిన అధికారిక బులెటిన్ 59వ సంచికలో వెల్లడించారు.
GCC సాంకేతిక విభాగం డైరెక్టర్ జనరల్ మహ్ఫూద్ అల్ రఖాది మాట్లాడుతూ.. GCC ఉమ్మడి యాంటీ డంపింగ్, కౌంటర్వైలింగ్ చర్యలు, సేఫ్‌గార్డ్ నిబంధనలు, వాటి అమలు మార్గదర్శకాలు, ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) యాంటీ డంపింగ్ ఒప్పందానికి అనుగుణంగా ఈ విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో క్లాస్జెన్ ఐ డ్రాప్స్ రీకాల్..!!
- బహ్రెయిన్ పాఠశాలల్లో పర్యావరణ పాఠాలు..!!
- యూఏఈలో వాహనాల కొనుగోలుపై కొత్త నిబంధనలు..!!
- భారత్ నుంచి పేపర్ దిగుమతులపై GCC యాంటీ డంపింగ్ విచారణ..!!
- ఒమన్‌లో ‘ముసందమ్ వింటర్ 2026-2027’కు శ్రీకారం..!!
- కువైట్‌లో ప్రాపర్టీ యజమానులకు హోంశాఖ హెచ్చరిక..!!
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు







