మూడు నెలలపాటు నిఘా నీడలో ఫ్రాన్స్..
- July 14, 2016
ఫ్రాన్స్ లో మరో దాడి జరిగిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ఆ దేశ అధ్యక్షుడు హోలాండే మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత ఏడాది నవంబర్ లో పారిస్ నగరంలో పై ఉగ్రవాదులు విరుచుకుపడి దాదాపు 130మందిని బలిగొన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ లో అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రస్తుతం అది కొనసాగుతుంది కూడా. అయితే, తాజాగా ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా మరోసారి ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. నీస్ నగరంలో బాస్టిల్ డే ఉత్సవాల్లో పాల్గొన్న జనాలపైకి ట్రక్కు నడుపుతూ వారి ప్రాణాలు బలిగొన్నారు. ఈ ఘటనలో 80 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరో మూడు నెలలు దేశంలో అత్యవసర పరిస్థితిని పొడిగిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







