అలనాటి ప్రముఖ నటి బి సరోజదేవి కన్నుమూత..
- July 14, 2025
బెంగళూరు: అలనాటి ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్ను మూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు.ఈ రోజు ఉదయం బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి తుదిశ్వాస వదిలారు.
పదమూడేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సరోజాదేవి తెలుగు, కన్నడ , తమిళంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్‌లతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సరోజాదేవి స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
1940 జనవరి 7న బెంగళూరులో జన్మించిన సరోజాదేవి చిన్నతనంలోనే శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన సరోజాదేవి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసారు. 1955లో సినీరంగంలోకి అడుగుపెట్టి, కొద్ది కాలంలోనే అగ్రనటిగా ఎదిగిన ఆమె, దక్షిణాది సినిమాల వెలుగుతీరుగా నిలిచారు.
ఆమె 1957లో’పాండురంగ మహాత్మ్యం’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టి, అదే ఏడాది ‘భూకైలాస్’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కలిసి ‘పెళ్లిసందడి’ , ‘జగదేకవీరునికథ’ , ‘మంచి చెడు’ , ‘దాగుడు మూతలు’,’శకుంతల’, ‘సీతారామకల్యాణం’, ‘దానవీరశూరకర్ణ’ వంటి అనేక హిట్ సినిమాల్లో నటించారు. 1963లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కలిసి ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.
సరోజాదేవి తమిళ పరిశ్రమలోనూ తనదైన స్థానం సంపాదించారు. తమిళ సూపర్‌స్టార్ ఎంజీఆర్‌తో కలిసి ఏకంగా 26 సినిమాల్లో నటించి అరుదైన రికార్డు నెలకొల్పారు. అలాగే శివాజీ గణేషన్‌తో ‘శెభాష్ మీనా’, ‘పుది పరవై’ వంటి సినిమాల్లో మెప్పించారు.మహాకవి కాళిదాసు చిత్రంలో విద్యాధరి పాత్ర ద్వారా ఆమె నటన పరాకాష్టకు చేరింది. తెలుగులో ఆమె చివరిసారిగా నటించిన చిత్రం‘సామ్రాట్ అశోక.
1969లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.
- 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
- మహాకవి కాళిదాసు చిత్రానికి జాతీయ అవార్డు రావడంలో ఆమె పాత్ర ప్రాముఖ్యం సంతరించుకుంది.
- పాండురంగ మహాత్మ్యం, భక్త ప్రహ్లాద, స్వర్గసీతా వంటి ఎన్నో చారిత్రక, భక్తి చిత్రాల్లో ఆమె నటన ముద్ర వేసింది.
- ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారత సినీ రంగానికి బి. సరోజాదేవి మృతి తీరని లోటుగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి