మ్వాసలాత్ గ్రీన్ చొరవ..ప్రశంసలు కురిపిస్తున్న ప్రయాణికులు..!!
- July 14, 2025
మస్కట్: ముత్రా రూట్ నంబర్ నాలుగులో ప్రవేశపెట్టిన మ్వాసలాత్ ఎలక్ట్రిక్ బస్సు ప్రయోగం విజయవంతమైంది. పిల్లల నుండి వృద్ధుల వరకు ముత్రా కార్నిచ్కు ప్రయాణించడాన్ని ఆస్వాదిస్తున్నారు. సాధారణ సమయంలో అన్ని ప్రయాణీకులు అల్ ఆలం ప్యాలెస్లో దిగుతారు. కానీ గ్రీన్ చొరవ సందర్భంగా దాదాపు అందరూ బోర్డింగ్ పాయింట్లో దిగి మ్వాసలాత్ చొరవను ప్రశసించారు. గురువారం నుండి ఆదివారం వరకు ఈ రూట్ లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నారు. ఇందుకు గాను ప్రయాణీకులకు గ్రీన్ టికెట్ అందజేశారు. సాధారణ బస్సులు ఎరుపు రంగులో ఉన్నప్పటికీ, ఈ ఎలక్ట్రిక్ బస్సును ఆకుపచ్చ రంగులో పెయింట్ చేయించడంతో ఇది ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా గ్రీన్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







