సార్ లో కారు ప్రమాదం..డ్రైవర్ కు 9ఏళ్ల జైలు శిక్ష..!!
- July 17, 2025
మనామా: సార్ లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో దంపతులు, వారి చిన్న కొడుకు మృతి చెందగా, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడిన కేసులో బహ్రెయిన్ కు చెందిన డ్రైవర్ కు తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ విషాదం మే 30న జరిగింది. సదరు డ్రైవర్ మాదకద్రవ్యాలు, మద్యం సేవించి రాంగ్ రూట్లో వేగంగా కారు నడుపుతూ..బాధిత కుటుంబం వెళుతున్న కారును ఢీకొట్టాడు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తులో డ్రైవర్ వాహనం నడిపే ముందు మాదకద్రవ్యాలు తీసుకున్నాడని తేలింది. డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అతని ఇంట్లో విడిగా జరిపిన సోదాల్లో గంజాయి (హాషిష్) బయటపడింది.
ట్రాఫిక్ కేసులో ఏడవ దిగువ క్రిమినల్ కోర్టు అతనికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. ప్రమాదంలో ఉపయోగించిన వాహనాన్ని జప్తు చేయాలని ఆదేశించింది.
ఇక మాదకద్రవ్యాల స్వాధీనం కేసులో మొదటి దిగువ క్రిమినల్ కోర్టు అతనికి అదనంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష, BD3,000 జరిమానా విధించింది. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను జప్తు చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







