స్టూడెంట్ స్టార్టప్.. చెట్ల నుండి ఆరోగ్య ఉత్పత్తులు..!!

- July 17, 2025 , by Maagulf
స్టూడెంట్ స్టార్టప్.. చెట్ల నుండి ఆరోగ్య ఉత్పత్తులు..!!

ఇబ్రి: ఇబ్రిలోని టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి నేతృత్వంలోని కంపెనీ "గ్రీనోవా" మెస్క్వైట్ చెట్టు (ప్రోసోపిస్ జులిఫ్లోరా) నుండి ప్లాస్టిక్, అధునాతన ఆరోగ్య ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా పలు ఉత్పత్తులను తయారు చేసింది. చాలా కాలంగా "హానికరమైన మొక్క"గా పరిగణించబడుతున్న దానిని పర్యావరణ, పారిశ్రామిక ఆవిష్కరణల కేంద్రంగా మార్చడంలో కంపెనీ విజయం సాధించిందని గ్రీనోవా సీఈఓ బదర్ సయీద్ అల్ అజీజీ తెలిపారు. ఇందుకోసం రెండు సంవత్సరాలకు పైగా పనిచేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్‌కు మెస్క్వైట్ ఆధారిత ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా కంపెనీ జాతీయ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు.  ఈ పదార్థం అధిక సామర్థ్యంతో పనిచేస్తుందని చైనాలోని ప్లాంట్ థెరపీ రీసెర్చ్ లాబొరేటరీ ధృవీకరించిందని వెల్లడించారు.  

మెస్క్వైట్ ఆకుల నుండి 100% సహజ హెయిర్ వాష్, బాడీ వాష్, స్థానిక చెట్టు నుండి తీసుకోబడిన సబ్బును ఉత్పత్తి చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు చేసినట్లు తెలిపారు.  గ్రీనోవా తక్కువ సమయంలోనే అద్భుతమైన మైలురాళ్లను సాధించిందన్నారు. అ'దహిరా గవర్నరేట్‌లోని వ్యవసాయం, మత్స్య, జల వనరుల శాఖతో మెస్క్వైట్ చెట్ల వ్యర్థాలను ఉపయోగించుకోవడానికి వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com