ఖతార్ లో కొత్తగా ఐదు ఇ-సేవలు..5.38% పెరిగిన లావాదేవీలు..!!
- July 18, 2025
దోహా: ఖతార్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) సింగిల్ విండో ప్లాట్‌ఫామ్ ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో (Q2) ఐదు కొత్త ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ లావాదేవీలలో 5.38% పెరుగుదలను(త్రైమాసిక ప్రాతిపదికన) నమోదు చేసింది. ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల మంత్రి హెచ్ ఇ షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థాని తన అధికారిక X ఖాతాలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
2025 రెండవ త్రైమాసికంలో రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌లను పూర్తి చేయడానికి పట్టే సమయం రెండు రోజులకు తగ్గిందని (98% ఎలక్ట్రానిక్‌గా), 88% మంది కస్టమర్లు సింగిల్ విండో సేవలతో సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. అదే విధంగా సింగిల్ విండో ప్లాట్‌ఫామ్ 2025 రెండవ త్రైమాసికంలో ఐదు కొత్త ఇ-సేవలను ప్రారంభించిందని వెల్లడించారు. అన్ని సేవలను 100 శాతం డిజిటలైజేషన్ చేయడంతోపాటు 2030 వరకు 20 శాతం వార్షిక వృద్ధి రేటుతో పేటెంట్ల సంఖ్యను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..