టీడీపీకి రాజీనామాచేసిన అశోక్ గజపతిరాజు
- July 18, 2025
విశాఖపట్నం: గోవా గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికి అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు.అనంతరం అధికారికంగా టీడీపీ హై కమాండ్కి ఈ లేఖను పంపించారు.ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు భావోద్వేగానికి గురయ్యారు.ఇన్నేళ్లు టీడీపీలో ఉన్నానని, పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు.పార్టీ, నేతలతో ఉన్న మధుర క్షణాలని ఆయన గుర్తు తెచ్చుకున్నారు.ఈ సందర్భంగా పార్టీకి అశోక్ గజపతిరాజు ఎంతగానో సేవలు అందించారని నేతలు కొనియాడారు.ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ప్రశంసల వర్షం కురిపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలుగా తనకు న్యాయం చేశారని చెప్పుకొచ్చారు అశోక్ గజపతిరాజు.పసుపు శుభసూచకమని, పసుపుని నమ్ముకున్న వారు ఎవరైనా బాగుంటారని తెలిపారు.కాగా, ఇవాళ(శుక్రవారం)సింహాచలం అప్పన్న స్వామిని కుటుంబ సమేతంగా అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు.ఆయనకు పూర్ణకుంభంతో అర్చక స్వాములు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.ఆలయం వద్ద అశోక్ గజపతిరాజును శాలువాతో మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ సత్కరించారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..