జూన్ 23న ఇరాన్ మిస్సైల్ అటాక్..విజువల్స్ ఔట్..!!

- July 22, 2025 , by Maagulf
జూన్ 23న ఇరాన్ మిస్సైల్ అటాక్..విజువల్స్ ఔట్..!!

ఖతార్: జూన్ 23న అల్ ఉదీద్‌లోని అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ మిస్సైల్ దాడికి సంబంధించి ప్రత్యేక వీడియోను ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జూన్ 13న ప్రారంభమైన ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కగా, ఇజ్రాయెల్‌పై టెహ్రాన్ ప్రతీకార దాడులు చేసింది.

జూన్ 22న మూడు ఇరానియన్ అణు స్థావరాలపై దాడి చేయడం ద్వారా అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచింది. దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "చాలా విజయవంతమైన దాడి" అని పిలిచారు.  టెహ్రాన్ అణు కార్యక్రమం కిరీట ఆభరణం అయిన ఫోర్డో అనంతర కాలంలో కనిపించకుండా పోయింది.   

అణు స్థావరాలపై అమెరికా చేసిన ఆశ్చర్యకరమైన దాడుల తరువాత, ఇరాన్ ప్రతిస్పందన గురించి చాలా మంది ఊహించారు.  గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై మిస్సైల్స్ తో విరుచుకుపడింది.  14.14 నిమిషాల నిడివి గల వీడియోలో, ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ వివరణాత్మక విషయాలను ప్రదర్శించింది.  

ఖతార్ అధికారి కెప్టెన్ మొహమ్మద్ రోబియా అల్కాబి మాట్లాడుతూ.. అల్ ఉదీద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని తన దళాలకు నిఘా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ Xలో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు. అన్నింటిని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com