ఏపీలోని తీర ప్రాంత జిల్లాలో హై అలెర్ట్
- July 22, 2025
విశాఖపట్నం: మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చైనా- హాంకాంగ్ లో బీభత్సం సృష్టించిన విఫా తుఫాన్..బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని పేర్కొంది. తుఫాన్ కారణంగా రాబోయే 3 రోజుల పాటు ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.ఉత్తర బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విఫా తుఫాన్ చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది.. అది తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ప్రస్తుతం తుఫానుగా రూపాంతరం చెందింది. ఈ అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ క్రమంలో వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం తీరం వెంబడి గంటకు 60 కి.మీ గరిష్ఠ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత 24 గంటల్లో గుంటూరు, మాచర్ల, నర్సీపట్నంలో 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..