ప్రముఖ గాయకుడు రామకృష్ణ అస్తమయం
- July 15, 2015
ప్రముఖ గాయకుడు రామకృష్ణ గత రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రామకృష్ణ జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రామకృష్ణ 1947 ఆగస్ట్ 20న విజయనగరంలో జన్మించారు. ఆకాశవాణి యువవాణి కార్యక్రమంలో లలితగీతాలతో తన కెరీర్ ప్రారంభించిన ఆయన 'ముత్యాల ముగ్గు, అందాలరాముడు, భక్త కన్నప్ప, శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర, దానవీరశూర కర్ణతాతా మనవడు, అల్లూరి సీతారామరాజు చిత్రాలతో పాడిన పాటలు రామకృష్ణకు మంచి పేరు తెచ్చాయి. సుమారు 200 సినిమాలలోనూ, అలాగే 5వేలకు పైగా భక్తిగీతాలు ఆలపించారు. ఆయనకు కుమారుడు సాయికిరణ్, కుమార్తె లేఖ ఉన్నారు. రామకృష్ణ మృతిపట్ల తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. కాగా రామకృష్ణ కుమారుడు సాయికిరణ్...'నువ్వే కావాలి' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత పలు చిత్రాలతో పాటు పలు టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. అలాగే ప్రముఖ గాయని పి.సుశీల...ఆయనకు మేనత్త.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







