సౌదీ లో తెలంగాణ వాసి మృతి
- July 15, 2015
చేసిన అప్పులు తీర్చేందుకు సౌదీ వెళ్లిన ఓ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో ప్రాణాలొదిలాడు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన చుక్క రాములు(55) తనకున్న నాలుగున్నర ఎకరాల్లో బోరు కోసం రూ.లక్ష అప్పు చేశాడు. బోర్లు వేసినా వాటిలో చుక్క నీరు పడలేదు. ఇక వ్యవసాయంతో లాభం లేదని భావించిన రాములు... ఉన్న ఊరు, కుటుంబాన్ని వదిలేసి మూడు రోజుల కిందట సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఆ ఖర్చుల కోసం మరో రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. సౌదీలో పనిచేసి ఈ అప్పులన్నింటినీ తీర్చేద్దామనుకున్న రాములు... అక్కడే గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం రాత్రి గుండె నొప్పితో బాధపడుతున్న రాములుని అతని మిత్రులు ఆసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు వదిలాడు. కుటుంబసభ్యుల రోదనలతో ఆకారం గ్రామంలో విషాదం నిండుకుంది. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని వెంటనే తమకు అందించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







