హైదరాబాద్ వాసులకు హైఅలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. బయటకు రావొద్దు..
- August 11, 2025
హైదరాబాద్ నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. నాలుగు రోజులుగా సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడి కుండపోత వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షంకుతోడు ఈదురుగాలులు తోడవుతుండటంతో చెట్లు విరిగి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే, ఇవాళ కూడా హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టనుంది. మధ్యాహ్నం తరువాత నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందట.
హైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.. మధ్యాహ్నం తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
మధ్యాహ్నం తరువాత అంటే.. 2గంటల తరువాత మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ వర్షం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో 25 నుంచి 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, హన్మకొండ, భద్రాద్రి, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తరువాత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్లో సాయంత్రం వేళ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







