వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్‌డౌన్ స్టార్ట్..
- August 11, 2025
ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. భారత్, శ్రీలంక దేశాలు ఈ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో 50 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ అధ్యక్షుడు జైషా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మిథాలీ రాజ్‌తో పాటు పలువురు మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు.
8 దేశాలు ప్రపంచకప్ కోసం పోటీపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మెగాటోర్నీ ఆరంభ వేడుకలు జరగనున్నాయి.అయితే.. ఇటీవల అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అక్కడ పెద్ద ఈవెంట్లకు అనుమతి ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వేడుకలు అక్కడ నిర్వహించలేని పరిస్థితులు ఉంటే.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించేలా బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్