విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- March 17, 2026
విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ నగరంగా ఎదిగేందుకు ఏపీ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాంబిల్లి నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్–NAOB వరకు సుమారు 70 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకుంది.ఈ రహదారి భోగాపురం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం గుండా రాంబిల్లిని కలుపుతుంది. విశాఖ మహానగర రద్దీని తగ్గించడంతో పాటు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఒక మలుపుగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రాజెక్టు కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా, విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయనుంది. భోగాపురం విమానాశ్రయం నుండి రాంబిల్లిలోని రక్షణ, పారిశ్రామిక కేంద్రాలకు వేగవంతమైన కనెక్టివిటీ లభించడం వల్ల లాజిస్టిక్స్ రంగం పుంజుకుంటుంది. ఐటీ సెంటర్లు, ఫార్మా సిటీ , పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు ఈ సెమీ రింగ్ రోడ్డు వెన్నెముకగా నిలవనుంది.దీనివల్ల విశాఖ నగరం లోపలికి భారీ వాహనాల రాక తగ్గి, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







