ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ టెలిఫోన్ సంభాషణ
- August 11, 2025
న్యూ ఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో... భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సోమవారం టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. తాజా పరిణామాలపై చర్చిస్తూ.. శాంతి స్థాపనకు సంబంధించిన అంశాలపై ఇరువురూ స్పష్టమైన అభిప్రాయాలు పంచుకున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల...
ఉక్రెయిన్‌లో తాజా పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సోమవారం టెలిఫోన్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తమ దేశ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలపై తన అభిప్రాయాలను భారత ప్రధానితో పంచుకున్నారు. ప్రాంతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావం, అంతర్జాతీయ సమాజం స్పందన వంటి అంశాలపై కూడా తన అభిప్రాయాలు వెల్లడించారు. సంభాషణలో ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ సమస్యకు శాంతియుత పరిష్కారం సాధించే దిశగా భారతదేశం ఎప్పటికీ నిలకడైన, స్థిరమైన వైఖరిని పాటిస్తుందని మరోసారి స్పష్టం చేశారు. అలాగే.. త్వరగా దేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు సహాయపడే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అవసరమైన సహాయం అందించడానికి భారత్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం, సాధ్యమైనంత తొందరగా శాంతి పునరుద్ధరించడమే తమ ప్రాధాన్యం అని మోదీ స్పష్టం చేశారు.
ఇరువురు నేతలు భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పురోగతిని రివ్యూ చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగం, విద్య, మానవతా సహాయం వంటి విభాగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే దిశగా చర్చించారు. భవిష్యత్తులో కూడా ఇరువురూ సన్నిహితంగా సంప్రదింపులు కొనసాగించేందుకు అంగీకరించారు.
తాజా వార్తలు
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్