అండా దొ ప్యాజా
- July 16, 2015
అండా దొ ప్యాజా
కావలిసిన పదార్ధాలు
గుడ్లు - 4
ఉల్లిపాయలు - పావుకిలో
పెరుగు - కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - స్పూన్
దనియాల పొడి - 1 స్పూన్
పలావు ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు - కొద్దిగా ప్లేవర్‌కి
పచ్చిమిర్చి - 2
పసుపు - చిటికెడు
కొత్తిమీర, పుదీనా - ఒక కట్ట
నూనె - సరిపడినంత
కారం - 4 స్పూన్లు
తయారీ విధానం
ముందుగా కోడిగుడ్లు ఉడికించి, పెంకు తీసి పెట్టాలి. కొన్ని ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కోసి, మరికొన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. బాణలిలో నూనె వేసి, దానిలో ప్లేవర్ కోసం చెప్పిన పదార్దాలన్నీ వేసి వేయించి, తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి బాగా వేయించాలి.ఇప్పుడు పొడవుగా కోసిన ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు దనియాల పొడి, పుచ్చగింజల పేస్ట్ వేసి పావుగంట సేపు ఉడికించాలి. తరువాత చిన్నగా కోసిన ఉల్లి ముక్కలను వేసి ఉప్పు, కారం, పసుపు వేసి, పెరుగు, పుదీనా, కొత్తిమీర తురుము వేసి బాగా ఉడికించి, చివరిగా ఉడికించిన గుడ్లు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







