పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్..
- August 25, 2025
పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసు (Post Office Scheme) అందించే పథకాల్లో రికరింగ్ డిపాజిట్ (RD) ఒకటి. ఈ పథకంలో రోజుకు రూ. 222 మాత్రమే ఆదా చేస్తే చాలు.. తద్వారా రూ. 11 లక్షలు సంపాదించుకోవచ్చు. ఈ పథకంపై ప్రభుత్వం హామీతో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.
పోస్టాఫీస్ RD స్కీమ్ ప్రయోజనాలేంటి?
పోస్టాఫీస్ RD పథకంలో ప్రతి నెలా స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. అంటే.. ప్రతిరోజూ రూ.222 ఆదా చేస్తే నెలకు రూ. 6,660 అవుతుంది. 5 ఏళ్లలో మీరు మొత్తం రూ. 3,99,600 డిపాజిట్ చేస్తారు. ఈ మొత్తంపై, మీరు 6.7 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి చక్రవడ్డీ అవుతుంది. వడ్డీపై వడ్డీ కూడా పొందవచ్చు.
అలా 5 ఏళ్ల తర్వాత రూ. 4,75,297 లభిస్తుంది. ఈ పెట్టుబడిని మరో 5 ఏళ్లు (మొత్తం 10 ఏళ్లు) పొడిగిస్తే.. మీ పెట్టుబడి రూ. 7,99,200 అవుతుంది. ఆపై మొత్తం రాబడి రూ. 11,37,891 అవుతుంది. రోజుకు కేవలం రూ. 222తో రూ. 11 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.
ఈ పథకంలో మీరు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. నెలకు కేవలం రూ. 100తో ప్రారంభించవచ్చు. ఈ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. చిన్నవారు, పెద్దలు లేదా పిల్లల కోసం కూడా ఓపెన్ చేయొచ్చు. మీరు సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీకు ముందుగా డబ్బు అవసరమైతే, మీరు 3 ఏళ్ల తర్వాత అకౌంట్ కూడా క్లోజ్ చేయొచ్చు.
RD స్కీమ్ ఇతర ప్రయోజనాలివే:
ఒక ఏడాది డిపాజిట్ల తర్వాత మీ సేవింగ్స్‌లో 50శాతం వరకు రుణం తీసుకోవచ్చు. ఈ రుణంపై 2శాతం అదనపు వడ్డీ మాత్రమే వసూలు చేయొచ్చు. నామినీ సౌకర్యం అందుబాటులో ఉంది. ఖాతాదారునికి ఏదైనా జరిగితే నామినీ అకౌంట్ క్లెయిమ్ చేయవచ్చు లేదా కొనసాగించవచ్చు.
ఈ పథకం వ్యవధి 5 సంవత్సరాలు. కానీ, మరో 5 ఏళ్లు పొడిగించవచ్చు. నెలవారీ డిపాజిట్లు సకాలంలో చేయాలి. లేకపోతే, నెలకు ఒక శాతం జరిమానా పడుతుంది. వరుసగా 4 వాయిదాలు తప్పినట్లయితే ఖాతా క్లోజ్ అయిపోతుంది.
తాజా వార్తలు
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!







