ఖతార్ డ్యూటీ ఫ్రీలో ‘కలెక్ట్ ఆన్ రిటర్న్’ సర్వీస్ గురించి తెలుసా?
- August 25, 2025
దోహా: ఖతార్ లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) ద్వారా ప్రయాణించే ప్రయాణీకుల కోసం ఖతార్ డ్యూటీ ఫ్రీ (QDF) ఇటీవల ‘కలెక్ట్ ఆన్ రిటర్న్’ సర్వీస్ ప్రవేశపెట్టింది. దీంతో సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుందని ప్రకటించారు. ఖతార్ నుంచి బయలుదేరే ప్రయాణికులు ఇక అదనపు బరువు లేదా లగ్జరీ వస్తువులను తీసుకెళ్లే ఆందోళన లేకుండా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాపింగ్ చేయవచ్చు. ఇందులో కొనుగోలు చేసిన వస్తువులను ఎయిర్ పోర్టులోనే సురక్షితంగా భద్రపరచవచ్చు. ఖతార్కు తిరిగి వచ్చిన తర్వాత, అరైవల్ టెర్మినల్లోని నియమిత పాయింట్ వద్ద నుంచి తీసుకోవచ్చు.
లగ్జరీ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, సౌందర్య సాధనాలు లేదా సావనీర్లతో సహా విస్తృత శ్రేణి వస్తువులకు ఈ సేవ వర్తిస్తుంది. అయితే, పొగాకు, సిగరెట్లు మరియు ఆల్కహాల్ వంటి వస్తువులను మినహాయించారు. అయితే సిగార్లు గరిష్టంగా 50 వరకు భద్రపరచవచ్చు. కాగా, హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రాకపోకల టెర్మినల్ ద్వారా వచ్చే ప్రయాణీకులకు మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉందని ఖతార్ డ్యూటీ ఫ్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







