హిమాచల్ ప్ర‌దేశ్‌పై ప్ర‌కృతి ప్రకోపం

- August 26, 2025 , by Maagulf
హిమాచల్ ప్ర‌దేశ్‌పై ప్ర‌కృతి ప్రకోపం

వ‌ర్షాల వ‌ల్ల సోమ‌వారం రాత్రి హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ (Himachal Pradesh)లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. భారీ వ‌రద‌ల వ‌ల్ల కిరాట్పూర్‌-మ‌నాలీ జాతీయ హైవేపై న‌ష్టం జ‌రిగింది. బియాస్ న‌ది ఉప్పొంగ‌డంతో జాతీయ ర‌హ‌దారి దెబ్బ‌తిన్న‌ది. హిమాచల్ ప్ర‌దేశ్‌(Himachal Pradesh)పై మ‌ళ్లీ ప్ర‌కృతి త‌న ప్ర‌కోపాన్ని చూపించింది. తీవ్ర స్థాయి వ‌ర్షాల వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. భారీ వ‌రద‌ల వ‌ల్ల కిరాట్పూర్‌-మ‌నాలీ జాతీయ హైవేపై న‌ష్టం జ‌రిగింది. దీంతో మండీ, మ‌నాలీ లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల .. బియాస్ న‌ది (Beas River)ఉప్పొంగుతున్న‌ది. దాని ఉప న‌దులు కూడా ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. జాతీయ ర‌హ‌దారి ప‌లు ప్ర‌దేశాల్లో బ్లాక్ అయ్యింది.

మ‌నాలీ స‌మీపంలో ఉన్న బిందు ధంక్ వ‌ద్ద బియాస్ న‌ది వ‌ర‌ద నీటికి జాతీయ హైవే కొట్టుకుపోయింది. దీంతో పాపుల‌ర్ టూరిస్టు కేంద్రానికి రాక‌పోక‌లు తెగిపోయాయి. మ‌నాలీలో న‌ది స‌మీపంలో ఉన్న ఓ హోట‌ల్‌.. ఆ వ‌ర‌ద‌లో కొట్టుకుపోయింది. మండి, కుల్లు ప్రాంతాల్లో డేంజ‌ర్ మార్క్ దాటి న‌ది ప్ర‌వాహిస్తున్న‌ది. లోత‌ట్టు ప్రాంతాల్లో జీవిస్తున్న వారి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ది. బ‌హంగ్‌, అలూ గ్రౌండ్ ప్రాంతాల నుంచి జ‌నాల‌ను త‌ర‌లిస్తున్నారు. మ‌రో 24 గంట‌ల పాటు న‌ది స‌మీపానికి వెళ్ల‌వ‌ద్దు అని టూరిస్టుల‌కు అధికారులు వార్నింగ్ ఇచ్చారు.

హిమాచల్ ప్రదేశ్ కొండచరియలో ఎంత మంది చనిపోయారు?
హిమాచల్ ప్రదేశ్: కొండచరియలు విరిగిపడటం, వరదలు మండిని నాశనం చేయడం, భయానక దృశ్యాలు విషాదాన్ని చూపిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ సంక్షోభంలో ఉంది, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న రుతుపవనాల వర్షం విధ్వంసం సృష్టిస్తోంది, 383 రోడ్లు స్తంభించిపోయాయి, 747 కి పైగా విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయడం మానేశాయి మరియు 249 నీటి సరఫరా పథకాలకు అంతరాయం కలిగిందని..

హిమాచల్ ప్రదేశ్ లో దెబ్బతిన్న ఆనకట్ట ఏది?
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని మలానా-I జలవిద్యుత్ ప్రాజెక్టులో భాగమైన కాఫర్‌డ్యామ్ ఆకస్మిక వరదల కారణంగా కూలిపోయిన క్షణం చూపించే భయానక వీడియో బయటపడింది. నిరంతర భారీ వర్షాల కారణంగా జరిగిన ఈ సంఘటన ఆనకట్ట దిగువ ప్రాంతాలలో భయాందోళనలను రేకెత్తించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com