రేపే మెగా జాబ్ మేళా..
- August 28, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. అందులో భాగంగానే జిల్లాల వారీలా ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి విజయనగరం జిల్లా భీమసింగి శ్రీ బాలాజీ జూనియర్ & డిగ్రీ కళాశాలలో ఆగస్టు 29వ తేదీ(రేపు)న మరో మెగా జాబ్ మేళా జరగనుంది. మొత్తం 17 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని దాదాపు 1,730 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. కాబట్టి, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా నిలవనుంది. ఈ జాబ్ మేళా గురించి మరిన్ని వివరాల కోసం 9000102013 సంప్రదించాలని అధికారులు సూచించారు.
సంస్థ, ఖాళీల వివరాలు:
- ప్రీమియర్ సోలార్ 60 ఖాళీలు
- డిక్సన్ 210 ఖాళీలు
- ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100 ఖాళీలు
- ష్నైడర్ ఎలక్ట్రిక్ 120 ఖాళీలు
- టాటా ఎలక్ట్రానిక్స్ 70 ఖాళీలు
- ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ 30 ఖాళీలు
- నవతా ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 30 ఖాళీలు
- అపోలో ఫార్మసీ 40 ఖాళీలు
- జాబ్ డీలర్స్ 100 ఖాళీలు
- డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 150 ఖాళీలు
- ఔరోర్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 100 ఖాళీలు
- హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ 150 ఖాళీలు
- యోకోహామా టైర్స్ అచ్చుతాపురం – విశాఖ ట్రేడర్స్, అగనంపూడి 100 ఖాళీలు
- 24Q 200 ఖాళీలు
- కాన్సెంట్రిక్స్ డాక్ష్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100 ఖాళీలు
- WNS 90 ఖాళీలు
- మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 80 ఖాళీలు
తాజా వార్తలు
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం
- ఖతార్‌లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్‌పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!
- UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!