మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్
- March 13, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మహిళల సమస్యల పరిష్కార దిశగా మరో అడుగు ముందుకు వేసింది. బాధితులు తమ ఫిర్యాదులను మరింత సులభంగా, పారదర్శకంగా నమోదు చేసుకునేందుకు వీలుగా రాబోయే రెండు, మూడు వారాల్లోనే ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన ‘జన్ సున్‌వాయ్’ (ప్రజా విచారణ) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించిన ఆమె, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ పరిష్కారం కావాల్సిన సమస్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఫోన్ నంబరు, వాట్సాప్, మెయిల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన ‘జన్ సున్‌వాయ్’ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళల నుంచి అర్జీలు స్వీకరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







