శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్ల కలకలం..
- August 28, 2025
హైదరాబాద్: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం రేగింది. ఓ ప్రయాణికుడి నుంచి 8 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సుఖ్దీప్ అనే ప్రయాణికుడి నుంచి 8 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి అమృత్సర్ వెళ్లేందుకు అతడు వచ్చాడు. అధికారులు చెక్ చేయగా బుల్లెట్స్ లభ్యమయ్యాయి. పట్టుబడ్డ నిందితుడిని పంజాబ్ వాసిగా గుర్తించారు.బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.
ప్రయాణికుడి వద్ద బుల్లెట్స్ లభ్యం కావడం ఎయిర్ పోర్టులో కలకలం రేపింది. తోటి ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. సుఖ్ దీప్ ఎందుకు తన వెంట బుల్లెట్స్ తెచ్చుకున్నాడు? అతడికి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? వాటితో అతడికి ఏం పని? ఈ వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







