'నమదు' చిత్రం ఆగస్టు ఐదో తేదీన విడుదల..
- July 18, 2016
మోహన్‌లాల్, గౌతమి జంటగా నటించిన చిత్రం 'నమదు'. మలయాళ మాతృకగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కూడా ఏకకాలంలో ఆగస్టు ఐదో తేదీన విడుదల కానుంది. తెలుగులో 'మనమంతా' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. సాయి శివాణి సమర్పణలో వరాహి చలనచిత్రం, సాయి కొరపాటి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మలయాళంలో ఈ సినిమాను 'విస్మయం' పేరుతో తెరకెక్కించారు. గతంలో మోహన్‌లాల్, గౌతమి కాంబినేషన్లో విడుదలైన 'హిస్ హైనెస్..' చిత్రం బాగా హిట్టయింది. అంతేకాక ఈ జంటకు మంచి పేరొచ్చింది. దీంతో వీరిద్దరూ కలసి నటిస్తుండటం విశేషం. ఇందులో విశ్వనాధ్- హనీషా అనే జంట కూడా నటిస్తోంది. ఇంకా నాజర్, వూర్వశి, చంద్రమోహన్, గొల్లపూడి మారుతీరావు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు తమిళంలో మదన్‌కార్కి మాటలు రాశారు. రాహుల్ శ్రీవత్సవ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మహేశ్ శంకర్ సంగీతం సమకూర్చారు. చంద్రశేఖర్ ఏలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆగస్టు ఐదో తేదీన మూడు భాషల్లోనూ సినిమాను విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







