'నమదు' చిత్రం ఆగస్టు ఐదో తేదీన విడుదల..

- July 18, 2016 , by Maagulf
'నమదు' చిత్రం  ఆగస్టు ఐదో తేదీన విడుదల..

మోహన్‌లాల్‌, గౌతమి జంటగా నటించిన చిత్రం 'నమదు'. మలయాళ మాతృకగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కూడా ఏకకాలంలో ఆగస్టు ఐదో తేదీన విడుదల కానుంది. తెలుగులో 'మనమంతా' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. సాయి శివాణి సమర్పణలో వరాహి చలనచిత్రం, సాయి కొరపాటి ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మలయాళంలో ఈ సినిమాను 'విస్మయం' పేరుతో తెరకెక్కించారు. గతంలో మోహన్‌లాల్‌, గౌతమి కాంబినేషన్‌లో విడుదలైన 'హిస్‌ హైనెస్‌..' చిత్రం బాగా హిట్టయింది. అంతేకాక ఈ జంటకు మంచి పేరొచ్చింది. దీంతో వీరిద్దరూ కలసి నటిస్తుండటం విశేషం. ఇందులో విశ్వనాధ్‌- హనీషా అనే జంట కూడా నటిస్తోంది. ఇంకా నాజర్‌, వూర్వశి, చంద్రమోహన్‌, గొల్లపూడి మారుతీరావు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు తమిళంలో మదన్‌కార్కి మాటలు రాశారు. రాహుల్‌ శ్రీవత్సవ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మహేశ్‌ శంకర్‌ సంగీతం సమకూర్చారు. చంద్రశేఖర్‌ ఏలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆగస్టు ఐదో తేదీన మూడు భాషల్లోనూ సినిమాను విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com