రేపు భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక..

- September 08, 2025 , by Maagulf
రేపు భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక..

న్యూ ఢిల్లీ: భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి కోసం సెప్టెంబర్ 9 అంటె రేపు ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి లు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. వెనువెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు. “ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్”గా వ్యవహరించనున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడి. “ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్”కు సహాయకులుగా మరో ఇద్దరు “ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు” నియమించారు. ఓటు వృధా కాకుండా ముందు జాగ్రత్తగా అధికార, ప్రతిపక్ష కూటములు “మాక్ ఓటింగ్” నిర్వహించారు. పార్టీలు జారీ చేసే “విప్” లు చెల్లవు..“సీక్రెట్ బ్యాలట్” విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార “ఎన్.డి.ఏ” కూటమి అభ్యర్థి గెలుపు పై ధీమా ఉన్నా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న బిజేపి. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పాత పార్లమెంట్ భవనం లోని “సెంట్రల్ హాల్” లో “మాక్ ఓటింగ్” లో “ఇండియా” కూటమి పక్షాల ఎంపీలు పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం “ఎన్.డి.ఏ” కూటమి పక్షాల ఎంపీల “మాక్ ఓటింగ్”. పార్లమెంటు ఉభయ సభలు—లోకసభ, రాజ్యసభ—కు చెందిన సభ్యులతో పాటు, నామినేటెడ్ సభ్యులు కూడా ఓటర్లుగా ఉండనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నుకునేందుకు ఓటింగ్ లో పాల్గొననున్న మొత్తం 782 మంది సభ్యులు.. లోకసభ లోని 543 మంది సభ్యులు ( ప్రస్తుతం 1 స్థానం ఖాళీ, రాజ్యసభ లోని 233 మంది సభ్యులు ( ప్రస్తుతం 5 ఖాళీలు), 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లు. సింపుల్ మెజారిటీ తో గెలుపొందనున్న అభ్యర్థి.. మొత్తం సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటే, 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు. చెల్లుబాటైన ఓట్లలో సగాని కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్ధిదే గెలుపుగా పరిగణిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com