నేడు సిక్రింద్రాబాద్ నుంచి రైలు సర్వీసులు పునఃప్రారంభం
- September 09, 2025
హైదరాబాద్: సిక్రింద్రాబాద్ స్టేషన్లో రైల్వే సేవలు మళ్లీ యధావిధిగా అందుబాటులోకి వచ్చాయి. రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనుల కారణంగా దారి మళ్లింపు, టెర్మినల్ మార్పులన్ని రైళ్లన్ని ఇకపై వాటి పాత మార్గాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే కాచిగూడలో తాత్కాలికంగా ఆగుతున్న విజయవాడ నుంచి కాచిగూడ, విజయవాడ శాతవాహన ఎక్స్ ప్రెస్ (రైలు నెం. 12713/ 12 714) సికిందరాబాద్ నుండి బయలుదేరనున్నట్లు వివరించారు. కొన్ని ట్రైన్స్ ఇప్పటికే ప్రారంభం కాగా మరికొన్ని ట్రైన్స్ సెప్టెంబరు 9 నుంచి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే సేవలను ప్రారంభించిన ముంబయి నుంచి విశాఖపట్నం డైలీ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెం. 18519/18520), విశాఖపట్నం నుంచి లింగంపల్లి, విశాఖపట్నం డైలీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 12805/12806), చర్లపల్లి నుంచి మోలా అలీ సికింద్రాబాద్ మీదుగా తిరిగి వెళ్ళే రైళ్లలో కాజీపేట నుంచి హడప్సర్ వెళ్లే కాజీపేట ట్రెవీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 17014/17013), కాకినాడ నుంచి పోర్ట్సయినగర్ వెళ్లే షిర్డీ,కాకినాడ పోర్ట్ ట్రెవీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 17206/17205) సెప్టెంబరు 9 నుంచి సికిందరాబాద్ స్టేషన్ నుంచి రాక పోకలు సాగించనున్నాయి. మచిలీపట్నం నుంచి సాయినగర్‌కు వెళ్లే షిర్డీ మచిలీపట్నం వీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 17208/17207), సెప్టెంబరు 12 నుంచి వాస్కోడ నుంచి గామాజా వెళ్లే వాస్కోడగామా వీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలునం. 17321/17322) రాకపోకలు సాగిస్తాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







